స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాలతో ముగింపు పలికాయి. సెన్సెక్స్ 413.24 పాయింట్లు నష్టపోయి 61,932.47 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ 168.40 పాయింట్ల నష్టంతో 43903.70 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.21గా ఉంది. బీపీసీఎల్, ఓఎన్‌జీసీ, కోల్‌ఇండియా, బజాజ్ ఫినాన్స్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా మోటార్స్, ఎమ్ అండ్ ఎమ్, అపోలో హాస్పిటల్స్ షేర్లు నష్టపోయిన జాబితాలో ఉన్నాయి.