మాజీ ఎంపీ మహువా నివాసంలో సీబీఐ సోదాలు

పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ మాజీ ఎంపీ మహువా మొయిత్రాపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే దర్యాప్తు అధికారులు సోదాలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని మహువా నివాసంతో పాటు ఇతర నగరాల్లో ఆమెకు చెందిన కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఈ కేసులో బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దుబే ఫిర్యాదుతో మహువాపై దర్యాప్తు చేపట్టాలని సీబీఐని లోక్‌పాల్‌ ఆదేశించింది. ఆరు వారాల్లోగా నివేదిక సమర్పించాలని సూచించింది. దీంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టింది.

అదానీ గ్రూప్‌ను, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునేలా ప్రశ్నలు అడిగేందుకు ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ నుంచి మహువా 2 కోట్లతోపాటు ఖరీదైన బహుమతులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దుబే ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన లోక్‌సభ నైతిక విలువల కమిటీ.. ఆమె అనైతిక ప్రవర్తనకు పాల్పడ్డారని తేల్చింది. ఈ నివేదిక ఆధారంగా గతేడాది డిసెంబరులో స్పీకర్‌ బహిష్కరణ వేటు వేయడంతో లోక్‌సభ సభ్యత్వం రద్దయ్యింది. దీన్ని మహువా తీవ్రంగా ఖండించారు. బహిష్కరణ వేటుపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇదే వ్యవహారానికి సంబంధించిన విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం నిబంధనల ఉల్లంఘన కేసులో ఈడీ ఆమెకు సమన్లు జారీ చేసింది.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్