తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

    తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. తీవ్రమైన ఎండలతో తెలంగాణ రాష్ట్రం మండిపోతోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవు తున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తు న్నాయి. నిన్న కూడా ఆరు జిల్లాలు పొగలుగక్కాయి. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదయింది. ఈ జిల్లాలోని చాలా మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్‌ భూపాల పల్లి, జగిత్యాల, వనపర్తి జిల్లాల్లోని పలు మండలాల్లో 45 నుంచి 45.3 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డ య్యాయి. మహబూబాబాద్‌, నిజామాబాద్‌ సహా పలు జిల్లాల్లో 44.9 డిగ్రీల ఎండ తీవ్రత కొనసాగింది. ఖమ్మం, ములుగు జిల్లాల్లో వడగాలులు వీచినట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుందని, కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్‌ మేజర్‌ గ్రామపంచాయతీకి చెందిన మేడిశెట్టి మహేశ్‌, మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన నరసయ్య వడదెబ్బతో మృతి చెందారు. అటు ఏపీలో ఎండలు మండుతున్నాయి. జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కరవుతున్నారు. ఇవాళ 51 మండలాల్లో తీవ్ర వడగా లులు, 151 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్