సెమీకండక్టర్ కంపెనీలకు బంపరాఫర్.. 50% సబ్సిడీ ఆఫర్ చేసిన మోదీ!

స్వతంత్ర వెబ్ డెస్క్: ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇండస్ట్రీలలో ఎక్కువగా సెమీకండక్టర్లు వినియోగిస్తున్నారు. ఇప్పటికీ ఇండియా వీటిని దిగుమతి చేసుకుంటోంది. ఈ విభాగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇండియా ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని గుజరాత్‌ పర్యటనలో భాగంగా శుక్రవారం నిర్వహించిన సెమీకాన్‌ ఇండియా 2023 సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ యంగ్‌ లియుతో సహా పలువురు సెమీకండక్టర్‌ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఈవెంట్‌కు హాజరయ్యారు. వారందరి సమక్షంలో మోదీ మాట్లాడుతూ.. గ్లోబల్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ చైయిన్‌లో భారతదేశం ఒక ముఖ్యమైన ప్లేయర్‌గా ఎదగడానికి చురుకుగా కృషి చేస్తోందని తెలిపారు. సెమీకండక్టర్ ఇండస్ట్రీ కోసం భారత్‌ చేస్తున్న ప్రణాళికలు ఆగిపోయాయని, నత్త నడక సాగుతున్నాయనే మాటలు వినిపిస్తున్న వేళ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

సెమీకండక్టర్ ఇండస్ట్రీ వృద్ధికి మద్దతు ఇవ్వడానికి దేశం పూర్తి ఎకోసిస్టమ్‌ను సృష్టిస్తోందని, పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుందని కూడా ప్రధాని చెప్పుకొచ్చారు. సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులను కోఆర్డినేట్ చేసి, మేనేజ్ చేయడానికి భారతదేశం గ్రాండ్ కండక్టర్‌గా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. తద్వారా సెమీ కండక్టర్ ఇండస్ట్రీ వృద్ధికి ఇండియా పూర్తిస్థాయిలో కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

 

విధాన సంస్కరణలతో ఇండియాలో సెమీకండక్టర్ సెక్టార్ వృద్ధిని వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నాం. చిన్నా, పెద్దా అనే ప్రాజెక్టులతో సంబంధం లేకుండా అన్ని టెక్నాలజీ లెవెల్స్‌లో దేశీయ చిప్ తయారీ కొరకు 50% ఆర్థిక మద్దతు /సబ్సిడీ వంటి ప్రోత్సాహకాలను కూడా అందజేస్తున్నాం.” అని అన్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్