గన్ పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్షకు బీఎస్పీ పిలుపు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ గ్రూప్-2(Group-2) వాయిదా వేయాలని బీఎస్పీ(BSP) రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్(Praveen Kumar) గన్ పార్క్(Gun Park) వద్ద సత్యాగ్రహ దీక్షకు(Satyagraha Deeksha) పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్(House Arrest) చేశారు. ఇంట్లోనే ప్రవీణ్ కుమార్ దీక్ష చేస్తున్నారు. తెలంగాణ గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ గన్ పార్క్ వద్ద శాంతి యుతంగా సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించారు.

శుక్రవారం బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో గ్రూప్-2 అభ్యర్థులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను పరీక్ష వాయిదా వేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వినతిపత్రం అందజేశారు. గురుకుల టీచర్, పాలిటెక్నిక్‌ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పోస్టుల పరీక్షలు పూర్తైన తర్వాత గ్రూప్‌- 2 పరీక్ష నిర్వహించాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరుసగా పోటీ పరీక్షలకు నోటిఫికేషన్లు రావడంతో ప్రిపేర్ కావడానికి టైం సరిపోవడవంలేదని గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. అందుకే టీఎస్పీఎస్సీని ముట్టడించారన్నారు.

Latest Articles

బాలయ్య సినిమాల.. ప్లానింగ్ మారుతుందా..?

నందమూరి బాలకృష్ణకి.. షూటింగ్లో గాయాలు అవ్వడం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య సినిమాల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్