తెలంగాణ హైకోర్టులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు ఊరట లభించింది. పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో హరీష్‌పై నమోదైన కేసులో ఆయనను అరెస్ట్ చేయవద్దంటూ కోర్టు ఆదేశించింది. ఎన్నికల సందర్భంగా తన ఫోన్‌ను ట్యాప్ చేయించారంటూ సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇటీవలే పంజగుట్ట పోలీసులు మాజీ మంత్రి హరీశ్‌రావుపై కేసు నమోదు చేశారు.
దాంతో హరీశ్‌రావు హై కోర్టును ఆశ్రయించారు. పంజాగుట్ట పీఎస్‌లో తనపై నమోదైన కేసును వెంటనే కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దానిని విచారించిన హైకోర్టు… హరీష్‌ను పోలీసులు అరెస్టు చేయవద్దంటూ ఆదేశించింది. నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులకు సూచించింది.