నేటి నుంచి మూడు రోజులపాటు బీఆర్‌ఎస్‌ దశాబ్ది వేడుకలు

      తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు బీఆర్‌ఎస్‌ పార్టీ సన్నద్ధమైంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు నేటి నుంచి మూడురోజులపాటు కార్యక్రమాలు కొనసాగ నున్నాయి. నేడు, రేపు హైదరాబాద్‌లో, ఎల్లుండి జిల్లాల్లో కార్యక్రమాల నిర్వహణకు పార్టీ అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు. సాయంత్రం హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్‌బండ్‌ వద్ద గల అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అమరు లకు ఘనంగా నివాళులర్పించనున్నారు.ఇక రేపు దశాబ్ద కాలం గడుస్తున్న నేపథ్యంలో ముగింపు వేడు కల పేరుతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సభ కేసీఆర్‌ అధ్యక్షతన జరుగనుంది. ఇదే సమయంలో జిల్లా ల్లోనూ ప్రభుత్వ ఆస్పత్రులు, అనాథ శరణాలయాలు, పలు సంస్థల్లో బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు పండ్లు, స్వీట్ల పంపిణీతో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 3వ తేదీన అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో ముగింపు ఉత్సవాలను నిర్వహించనున్నారు. దీనికి జిల్లా పార్టీ నేతలు, ప్రజా ప్రతి నిధులు, కార్యకర్తలు, అభిమానులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాల ఆవరణలో జాతీయ పతాకంతోపాటు పార్టీ పతకాన్ని కూడా ఎగురవేసేలా కార్యాచరణ ప్రకటించారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్