వధువు జంప్.. 13రోజులుగా మండపంలోనే వరుడు ఎదురుచూపులు

స్వతంత్ర, వెబ్ డెస్క్: పెళ్లి పీటల మీద నుంచి వధూవరులు పారిపోవడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటూనే ఉన్నాం. తాజాగా పెళ్లి మండపం నుంచి వధువు వెళ్లిపోయిన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ వధువు కోసం వరుడు 13రోజులు మండపంలోనే ఎదురుచూడడం. పాలీ జిల్లాలోని సౌనా గ్రామానికి చెందిన మనీషాకు దగ్గర బంధువైన శ్రవణ్ కుమార్‌తో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. మే 4న ఉదయం వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి కుమార్తె మేనమామ కొడుకుతో పారిపోయింది. ఎలాగో ఆమె ఆచూకీ కనిపెట్టిన బంధువులు ఇంటికి తీసుకువచ్చారు. అయితే తాను మాత్రం పెళ్లి చేసుకోవనని ఆమె మెండికేసింది. పెళ్లి కుమారుడు మాత్రం ఏకంగా 13రోజుల వరకు పెళ్లి బట్టలతో మండపంలోనే ఎదురు చూశాడు. ఎట్టకేలకు వధువు పెళ్లికి ఒప్పుకోవడంతో బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది.

Latest Articles

భారత్‌లో తెలంగాణ అంతర్భాగమే.. రావొద్దని చెప్పడానికి మీరెవరు? తెలంగాణలో జనసేన పోటీ -పవన్‌ కళ్యాణ్‌

తెలంగాణపై తనకున్న ప్రేమ రాజకీయలకు అతీతమని.. తెలంగాణ బాగుండాలని కోరుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. జూబ్లిహిల్స్‌లోని తన నివాసంలో ప్రెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణ గడ్డపై పుట్టింది జనసేన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్