స్వతంత్ర, వెబ్ డెస్క్: రోజురోజుకి దారుణాలు ఎక్కువైపోతున్నాయి. మనుషులు మృగాళ్ల మారి అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే యావత్తు దేశాన్ని కుదిపేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో 16 ఏళ్ల బాలికను ఓ యువకుడు అత్యంత పాశవికంగా పొడిచి పొడిచి చంపాడు. అందరూ చూస్తుండగానే.. ఆ బాలికను అత్యంత దారుణంగా బాలికపై దాదాపు 20 సార్లు కత్తితో అత్యంతపాశవికంగా పొడిచి చంపాడు. అంతటితో కూడా కోపం చల్లారని ఆ క్రూరుడు.. పెద్ద బండరాయితో బాలిక తలపై పలుసార్లు మోదడం అక్కడున్న వారందరిని కలిచివేసింది. ఇంతటి దారుణం జరుగుతున్న అక్కడున్న వారందరు ఒక్క అడుగుకూడా ముందుకు వేయకుండా.. ఆ దారుణాన్ని ఆపలేకపోడవం గమనార్హం. ఈ ఘటన చూస్తే మాత్రం అందరిలో మానవత్వం చచ్చిపోయిందా అని అనిపించేలా చేస్తుంది. ఈ ధారుణమంతా అక్కడకున్న సీసీ ఫుటేజీలో నమోదయ్యింది.
ఢిల్లీ రోహిణి ప్రాంతంలోని షహబాద్ డెయిరీ ప్రాంతానికి చెందిన ఓ పదహారేళ్ల బాలిక.. అక్కడే ఉంటున్న ఓ యువకుడితో స్నేహంగా ఉంటోంది. ఒకానొక సందర్భంలో ఇటీవల వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఆదివారం సాయంత్రం ఓ స్నేహితురాలి ఇంట్లో పుట్టినరోజు వేడుకకు బయలుదేరింది ఆ బాలిక. ఈ క్రమంలో ఆమె వెంట వెళ్లిన ఆ యువకుడు.. బాలికపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఇంతదారుణం జరుగుతున్న అక్కడున్న వారు ఒక్కరు కూడా ఆపకపోవడం గమనార్హం. విషయం తెలుసుకున్న షహబాజ్ డెయిరీ పోలీసులు… వెంటనే ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.