స్వతంత్ర వెబ్ డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా నటించిన చిత్రం ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జానకి పాత్రలో కృతిసనన్, లంకేశ్వరుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్, పాటలు అద్భుతమైన స్పందన దక్కించుకున్నారు. తాజాగా ఈ సినిమాలోని ‘రామ్.. సీతా రామ్’ పాటను చిత్ర బృందం విడుదల చేసింది. రాఘవుడు, సీత మధ్య సంభాషణతో ప్రారంభమైన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులోని విజువల్స్ అద్భుతంగా ఉండడంతో సినిమాపై మరింత అంచనాలు నెలకొన్నాయి. గాయకుడు కార్తీక్ ఈ పాటను ఆలపించగా.. సచేత్ పరంపర సంగీతం అందించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.