సన్నాలకే బోనస్ ….ఇతర రకాల వడ్లకు నో

తెలంగాణ రాజకీయాలు రైతుల చుట్టూ వడ్ల కళ్లాల చుట్టూ తిరుగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం పండించిన ప్రతి క్వింటాల్ వడ్లకు 500రూపాయల బోనస్ అందిస్తామని మానిఫెస్టో లో ప్రకటించింది. అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నేతలు ప్రస్తుతం మాట మార్చారా..? కేవలం సన్నాలకే బోనస్ అనడం దొడ్డు వడ్లు పండించే రైతులకు సున్నాలేనా?

తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్లకు మద్దతు ధర తో పాటు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పుడు దానిమీద పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. క్యాబినెట్ లో చర్చ అనంతరం మీడియా బ్రీఫ్ లో మంత్రి పొంగులేటి స్పష్టంగా సన్నాలకు బోనస్ అని మాట్లాడటంతో వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. ప్రభుత్వం వర్షన్ ప్రకారం. ఇటు రాష్ట్రంలో, అటు దేశంలో ఏటేటా సన్నాల ప్రాధాన్యం పెరుగుతున్నా, వాటిని పండించే రైతులు తగ్గుతున్నారని, దానికి ప్రధాన కారణం సన్నాల దిగుబడి తక్కువగా ఉండటం నూక శాతం దొడ్డు వడ్లతో పోల్చితే ఎక్కువ ఉండడం. ఇది రైతులకు నష్టంగా మారుతోంది. దేశవ్యాప్తంగా దొడ్డు వడ్ల సాగు, పంట దిగుబడి గడిచిన మూడు నాలుగేళ్లలో రెట్టింపు అయింది. సన్నాల దిగుబడి అదే స్థాయిలో పడిపోయింది. ఈ సారి మార్కెట్లో బియ్యం ధర అమాంతంగా పెరిగిపోవడానికి ఇదీ ఓ కారణం. నిరుడు, అంతకు ముందు క్వింటాల్ బియ్యం ధర నాలుగు వేల రూపాయలు ఉంటే, ప్రస్తుతం 6వేల500 రూపాయల నుంచి ఏడువేల వరకూ ఎగబాకింది. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది.ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో అత్యవసరంగా చర్చించాల్సిన అంశంగా, ఈసీ ప్రత్యేక అనుమతి తో నిర్వహించిన మంత్రి వర్గం సమావేశంలో రైతాంగం, పంట కొనుగోలు, తడిసిన ధాన్యం మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు తదితర అంశాలు చర్చకు వచ్చాయి. అయితే మొదటి నుంచి రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎండగడుతూ ముందుకు వెళ్ళడమే ఎజెండాగా పనిచేస్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నాయి.

సన్నాలకు బోనస్ అనడం రైతులకు సున్నం పెట్టేందుకేనని, రాష్ట్రంలో 80 శాతం ఉన్న దొడ్డు వడ్ల రైతులకు బోనస్ ఎగ్గొట్టేందుకే ప్రభుత్వ నిర్ణయమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం వరి రైతులందరికీ క్వింటాల్ కి 500 రూపాయలు బోనస్ ఇవ్వాలంటే.. రాష్ట్ర ప్రభుత్వం మీద 6వేల కోట్ల రూపాయల భారం పడుతుంది. అదే సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తే కేవలం ఐదారు వందల కోట్లతో చేతులు దులుపుకోవచ్చునని ప్రభుత్వం చూస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు. దొడ్డు వడ్ల నుంచి సన్నాలకు రైతులు పంట మార్పిడి చేస్తారని ప్రభుత్వం భావించగా, రైతాంగం ఆగ్రహానికి గురికాక తప్పదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.రాష్ట్రంలో ఎక్కువ డిమాండ్ ఉన్న సన్నాల ఉత్పత్తిని ప్రోత్సహించే ప్రభుత్వ వ్యూహం బెడిసి కొట్టింది. సన్నాలను రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ లబ్ధి దారులకు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కోసం సరఫరా చేయాలని ప్రభుత్వం భావించింది. ఇది మంచి ఆలోచనే అయినా, సన్నాల సాగు లో రైతులు ఎదుర్కొనే ఇబ్బందులు అనేకం. ముఖ్యంగా దొడ్డు వడ్ల తో పోల్చితే సన్నాలకు ఎక్కువ మోతాదులో సాగునీరు అవసరం, దీనికి తోడు దోమ పోటు, వంటి తెగుళ్లు సన్నాల దిగుబడి తక్కువ. నూక శాతం ఎక్కువ ఖరీఫ్ లో ముఖ్యంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వడ్ల గింజలు పగిలి ఎక్కువ నూకలు వస్తాయి. అయితే సన్నాలు పండించే రైతులకు వచ్చే నష్టాన్ని భర్తీ చేసేందుకు బోనస్ ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

వరి క్వింటాల్ కి 500 రూపాయల బోనస్ వచ్చే యాసంగి నుంచి చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే, రైతులు సన్నాల సాగుకు మొగ్గుచూపుతారని ప్రభుత్వం ప్రయత్నాలు ఫలించడం ఏమో గానీ, ప్రభుత్వాన్ని అయోమయంలో పడేసినట్లు అయ్యింది. సన్నాలతో మొదలు పెడతాం అని చెప్పాం అని, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క నష్ట నివరణకు పూనుకొని సంజాయిషీ ఇచ్చారు. కానీ బోనస్ రగడ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. చూడాలి మరి బోనస్ వివాదం ఎంతవరకు దారి తీస్తుందో.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్