ఇండిగో విమానానికి బాంబు బెదిరింపుతో విమాన సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రయాణికులను ఎమర్జెన్సీ ద్వారం నుంచి దించేసి, క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. వెంటనే అప్రమత్త మైన సిబ్బంది, ప్రయాణికులను అత్యవసర ద్వారం ద్వారా దించేశారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానా శ్రయం నుంచి ఈ విమానం ఉదయం 5 గంటలకు బయలు దేరాల్సి ఉంది. అయితే, విమానా నికి బాంబ్ బెదిరింపు రావడంతో అలర్ట్ అయిన పైలట్ అత్యవసరంగా ఫ్లైట్‌ను ల్యాండ్ చేసి, ఎమర్జెన్సీ డోర్ ద్వారా ప్రయాణికులకు దించారు. ఆ తర్వాత బాంబ్ స్క్వాడ్, సిబ్బంది కలిసి విమానంలో తనిఖీలు చేపట్టారు. ఇక బెందిరింపు విషయం తెలియడంతో ప్రయాణికులు హడలిపోయారు. అయితే, ప్రయాణి కులంరూ సేఫ్ గా ఉన్నట్టు ఇండిగో సిబ్బంది స్పష్టం చేశారు.
ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు
0
211
Previous article
Next article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


