కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పుపట్టిన బీజేపీ ఎంపీ

ఎమ్మెల్సీ కవితపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించనని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. సంజయ్ వ్యాఖ్యలకు, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని అరవింద్ క్లారిటీ ఇచ్చారు. అది ఆయన వ్యక్తిగతమని.. ఆ వ్యాఖ్యలను ఆయనే సంజాయిషీ ఇచ్చుకుంటారని స్పష్టంచేశారు. సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదని.. సామెతలు ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది పవర్ సెంటర్ కాదని.. నేతలను సమన్వయం చేసే బాధ్యత మాత్రమేనని పేర్కొన్నారు. అరవింద్ వ్యాఖ్యలలో తెలంగాణ బీజేపీలో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. సంజయ్, అరవింద్ మధ్య కొద్దికాలంగా విభేధాలు ఉన్నాయని కమలం నేతలు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో కల్వకుంట్ల కుంటుంబం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఈడీ విచారణలో కవిత సహకరించలేదని తమ దగ్గర సమాచారముందని వెల్లడించారు.

Latest Articles

సైదాబాద్‌లోని సక్సెస్‌ స్కూల్‌లో మతబోధనల వివాదం.. పాఠశాల దగ్గర ఉద్రిక్తత

హైదరాబాద్‌ పాతబస్తీలోని ఓ స్కూల్‌లో హోమ్‌వర్క్‌కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. సైదాబాద్‌లోని సక్సెస్‌ స్కూల్‌లో విద్యార్థులకు మతపరమైన హోం వర్క్‌ ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్‌ యాజమాన్యాన్ని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్