సార్వత్రిక ఎన్నికల మహాసంగ్రామాన్ని మరింత రసవత్తరంగా మార్చేందుకు బీజేపీ అగ్రనేతలు తెలంగాణ బాట పడుతున్నారు. ప్రధాని మోదీ మంగళవారం రాష్ట్ర పర్యటనకు రానున్నారు. అలాగే మే 3న సైతం తెలంగాణలో ప్రచారం చేపట్టనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు జహీరాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోని అందోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న అల్లాదుర్గ్ మండలంలో ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. మరోసారి మే 3న తెలంగాణకు రానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మే 1న హైదరాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోక్‌సభలోని చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గౌలిపురలో సాయంత్రం 5 గంటలకు రోడ్ షో నిర్వహించనున్నారు. మరోవైపు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీపాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారపర్వంలోకి దిగనున్నారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన బీజేపీ
0
415
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


