హైదరాబాద్‌లో బైక్ రేసింగ్‌లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రాత్రిళ్లు రేసింగ్ నిర్వహిస్తూ హల్‌చల్ చేస్తున్న వారిని అరెస్టు చేశారు పోలీసులు. శనివారం రాత్రి టి-హబ్, ఐటీసీ కోహినూర్, నాలెడ్జ్ పార్క్, సత్వ భవనం, మై హోమ్ భుజ ప్రాంతాల్లో రేసింగ్ పాయింట్లపై రాయదుర్గం పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిం చారు. కొంతకాలంగా రాత్రిళ్లు రోడ్లపై విచ్చలవిడిగా వాహ నాలు నడుపుతున్నారన్న సమాచారంతో డ్రైవ్ చేపట్టారు. ఈ డ్రైవ్‌లో బైక్ రేసింగ్‌కు పాల్పడుతున్న 50 ద్విచక్రవాహనాలను సీజ్ చేసి, వారిపై ఐపీసీ 336, 341, మోటార్ వెహికిల్ చట్టం 184సెక్షన్లు కింద కేసు లు నమోదు చేశారు. సీజ్ చేసిన వాహనాలకు ఆర్టీవోకి అప్పగించారు. బైకర్లను కోర్టు ఎదుట హజరు పరి చారు. కమిషనరేట్ పరిధిలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రాయదుర్గం పోలీసులు.


