శిరోముండనం కేసులో విశాఖ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది ఏపీ హైకోర్టు. తోట త్రిమూర్తులు దాఖలు చేసిన పిటిషన్‌లో ఫిర్యాదుదారులను ప్రతివాదులుగా చేర్చాలని హైకోర్టు ఆదేశించింది. అనం తరం ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను మే మొదటి వారానికి కోర్టు వాయిదా వేసింది. దళిత యువకులకు శిరోముం డనం కేసులో త్రిమూర్తులుతో పాటు మరో 8 మందికి 18 నెలల జైలు శిక్ష విధిస్తూ ఈ నెల 16వ తేదీన విశాఖ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో విశాఖ కోర్టు తీర్పును తోట త్రిమూర్తులు హైకోర్టులో సవాల్ చేశారు. విశాఖ కోర్టు తీర్పు అమలుపై స్టే ఇవ్వాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం తోట త్రిమూర్తులు అభ్యర్థనను తోసిపుచ్చి.. విశాఖ కోర్టు తీర్పు అమలుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు బిగ్ షాక్
0
250
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


