28.2 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

టెస్ట్‌లో క్రిష్‌కు భారీ ఊరట

        హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో సినీ దర్శకుడు క్రిష్‌ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. రాడిసన్‌ హోటల్‌లో డ్రగ్స్‌ను వినియోగించారని గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసినందుకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ క్రిష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పోలీసులు సీఆర్పీసీ సెక్షన్‌ 41ఎ కింద పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతించాలన్నారు. దీనికి అనుమ తించిన హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.పెడ్లర్ అబ్బాస్ అలీ అరెస్ట్‌తో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డైరెక్టర్ క్రిష్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు అబ్బాస్ తెలుపడంతో కేసు నమోదు చేశారు. అతనికి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే సమాధానం రాకపోవడంతో క్రిష్ పరారీలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై క్రిష్ క్లారిటీ ఇచ్చారు. తను పలు కారణాల వల్ల హైదరాబాద్‌కు దూరంగా ఉన్నానన్నారు. తర్వాత క్రిష్ పోలీసుల ఎదుట హాజరైనారు.

     ఈనేపథ్యంలోనే క్రిష్ డ్రగ్స్ టెస్ట్‌ల కోసం శాంపిల్స్ ఇచ్చారు. అతని బ్లడ్, యూరిన్ శాంపిల్స్‌ను పోలీసులు ల్యాబ్‌కు పంపారు. యూరిన్ టెస్ట్‌లో క్రిష్‌కు భారీ ఊరట లభించింది. ఈ క్రమంలోనే పోలీసులు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ క్రిష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన వాదించారు. ఇందులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Latest Articles

అక్కినేని అభిమానులకు.. ఇక పండగే..

అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. షూటింగ్లో బిజీగా ఉన్నారు. క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. అఖిల్ సినిమా లెనిన్ పై క్లారిటీ వచ్చింది కానీ.. నాగార్జున,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్