Bhola Shankar: భోళాశంకర్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

స్వతంత్ర వెబ్ డెస్క్: వాల్తేరు వీరయ్య సక్సెస్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన చిత్రం భోళాశంకర్(Bhola Shankar). స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా తమన్నా భాటియా నటించగా… మహానటి కీర్తి సురేష్ చెల్లెలుగా నటించారు. సుశాంత్ ఈ సినిమాలో కీర్తికి లవర్ గా కనిపించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించగా ఇక ఎన్నో అంచనాల నడుమ భోళా శంకర్ ఆగస్టు 11వ తేదీన (నేడు) థియేటర్లలోకి వచ్చింది. సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.

తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం(Vedalam) అనే సబ్జెక్టు తీసుకుని తెలుగు నేటివిటీకి తగినట్లుగా మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాని తెరకెక్కించామని దర్శకుడు రమేష్ ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. నిజానికి మెహర్ రమేష్ (Mehar Ramesh) ఒక అవుట్ డేటెడ్ డైరెక్టర్ అనే వాదన ముందు నుంచి అందరూ తెరమీదకు తెస్తూనే ఉన్నారు. దానికి కారణం ఆయన చివరిగా షాడో (Shadow)అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి అవకాశం ఇచ్చారంటే ఏదో మ్యాజిక్ చేస్తాడని అందరూ నమ్మారు కానీ సినిమా మొదలైనప్పటి నుంచి ఆయన తన పనితనాన్ని ఎంతవరకు మెరుగుపరుచుకున్నాడో సగటు ప్రేక్షకుడికి కూడా ఈజీగా అర్థం అయిపోతుంది. వాస్తవానికి వేదాళం సినిమా నుంచి అక్రమ యువతుల ట్రాఫికింగ్ అనే ఒక విషయాన్ని తీసుకుని తెలుగు నేటివిటీకి తగిన మార్పులు చేర్పులు చేసిన మాట వాస్తవమే.

కానీ పూర్తిస్థాయిలో తెలుగు ప్రేక్షకుల అభిరుచి ఏ మాత్రం పట్టించుకోకుండా తనకు తాను మెగాస్టార్ చిరంజీవిని ఎలా చూసుకోవాలి అనుకున్నారో అదే విధంగా తెరమీద ప్రజెంట్ చేసే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. ఫస్ట్ ఆఫ్ మొత్తం శంకర్ కలకత్తా నేపథ్యంలో సీన్లు ఏమాత్రం ఆసక్తి పెంచకుండానే సాగిపోతూ ఉంటాయి. ఒక రకంగా మెగాస్టార్ లో ఉన్న కామెడీ ఈజ్ ని కూడా ఆయన వాడుకోలేకపోయాడు. నిజానికి భోళా శంకర్ అనేది ఒక ఫక్తు కమర్షియల్ ఎంటర్టైనర్ అని ముందు నుంచి చెబుతూనే వచ్చారు. కమర్షియల్ ఎంటర్టైనర్ పని ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఎంటర్టైన్ చేయడమే కానీ భోళా శంకర్ లో అదే మిస్ అయింది. మెగాస్టార్ చిరంజీవిలో స్వతహాగా ఉండే కామెడీ ఈజ్ ని కూడా పూర్తిస్థాయిలో వాడుకోలేకపోయారేమో అనిపించింది.  వీరు కాకుండా సినిమాలో వేణు ఎల్దండి, గెటప్ శ్రీను, బిత్తిరి సత్తి, షకలక శంకర్, శ్రీముఖి, రష్మీ ఇలా పేర్లు కూడా గుర్తుంచుకో లేనంత మంది నటీనటులు ఉన్నారు. కానీ చాలా తక్కువ సీన్లకే పరిమితమయ్యారు అయితే ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కాస్త మెరుగనిపిస్తుంది. శంకర్ బ్యాక్ గ్రౌండ్ రివిల్ చేయడం ఆ తర్వాత కొన్ని ఎమోషనల్ సీన్స్ తో సెకండ్ హాఫ్ ప్రేక్షకులను కొంతవరకు మెప్పించొచ్చు.

Latest Articles

తీవ్రంగా కొనసాగుతున్న ఇరాన్‌, అమెరికా యుద్ధం

అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య యుద్ధం భయంకరంగా కొనసాగుతోంది. శాంతి ఒప్పందం జరిగినప్పటికీ.. రెండు దేశాలు రూల్స్ బ్రేక్ చేసి హింసకాండను కొనసాగిస్తున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్