రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరడంపై బీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. బీజాపూర్ రహదారిపై ఎమ్మెల్యే యాదయ్య దిష్టిబొమ్మను బీఆర్‌ఎస్ కార్యకర్తలు దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌వీ నేత దర్శన్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన యాదయ్య స్వలాభం కోసం కాంగ్రెస్‌లో చేరారని నిప్పులు చెరిగారు. కాలె యాదయ్య వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యాదయ్య పార్టీ మారడం అనై తికం అని దశరథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల న్నారు.