ఎన్నికలు సమీపిస్తున్న వేళ …. జోరందుకున్న ప్రచారాలు

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా నువ్వా.. నేనా అంటూ ప్రచారం లో దూసుకెళ్తు న్నారు. నిజామాబాద్‌ పార్లమెంట్ అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీలు ప్రచారంలో మరింత దూకుడు పెంచాయి. ప్రచారా నికి మూడు రోజులే ఉండడంతో ఎండా, వానలను సైతం లెక్కచేయకుండా సుడిగాలి పర్యటనలు చేస్తున్నాయి.

నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాల్లో పాల్గొంటున్నారు. చిన్నచిన్న గ్రామాలకు వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ఇన్చార్జ్‌లను సమ న్వయం చేసుకుంటూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. పోలింగ్‌ సమయం దగ్గర పడడంతో పోలింగ్‌ బూత్‌ లెవల్‌లో ప్రచారంపై దృష్టి సారిస్తు న్నారు. పోలింగ్‌ బూత్‌ పరిధిలోని ఓటర్లను ప్రతిరోజు కలిసే విధంగా పోటీపడుతున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటర్లకు హామీల వర్షం కురిపిస్తున్నారు. గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్‌, కాంగ్రెస్‌ తరపున తాటిపల్లి జీవన్‌ రెడ్డి, బీఆర్ఎస్‌ తరపున బాజిరెడ్డి గోవర్ధన్‌ బరిలో ఉన్నారు. ముగ్గురూ సీనియర్లు కావడం, రాజకీయాల్లో అనుభవం ఉండడంతో ఎవరికి వారే పొలిటికల్‌ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు.

ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు ఈ నెల 11 సాయంత్రం 5గంటల వరకే ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లో 800కు పైగా గ్రామాలు ఉండడంతో పార్లమెంట్‌ అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తు న్నారు. భారీ బహిరంగ సభలు, కార్నర్‌ మీటింగ్‌లతో ప్రచారాలు సాగిస్తు న్నారు. ఈ నెల 13న పోలింగ్‌ జరగనుండడంతో మరింత దూకుడు పెంచారు. మండల, నియోజకవర్గ ప్రచారాలకు పరిమితమైన ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పుడు పోలింగ్‌ బూత్‌లపై ఫోకస్‌ పెట్టారు. బూత్‌ ల పరిధిలోని ఓటర్ల లిస్టు ఆధారంగా ముఖ్య కార్యకర్తలకు, నేతలను, ఇన్జార్జిలను నియమించి పూర్తి స్థాయిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. సీనియర్లను సమన్వయం చేసుకుంటూ పూర్తిస్థా యిలో ప్రచారం చేసుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మూడు రోజుల్లో ప్రచార ఘట్టం ముగియ నుంది. అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారాలు సాగిస్తున్నారు. అభ్యర్థులు ఎవరికి వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో విజయం ఎవరికి వరిస్తుందో వేచి చూడాలి.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్