కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఎంపీగా రాహుల్ పై అనర్హత వేటు పడగా.. తాజాగా కేంద్రం మరో షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 22లోగా ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని లోక్ సభ హౌసింగ్ ప్యానెల్ నోటీసులు జారీచేసింది. ఎంపీగా అనర్హత వేటు పడడంతో ప్రభుత్వ బంగ్లాలో ఉండే అర్హత లేదని తెలిపింది. అలాగే ఎంపీగా రాహుల్ కు వచ్చే వేతనం, అలవెన్స్ లు కూడా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. కాగా 2019 ఎన్నికల ప్రచారం సమయంలో దొంగల ఇంటి పేరు మోదీనే ఎందుకుంటోంది అని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ రాహుల్ పై పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దీంతో నిబంధనల ప్రకారం రాహుల్ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు పడింది.
ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని రాహుల్ గాంధీకి నోటీసులు
0
319
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


