కేరళలో మరో కిడ్నీ రాకెట్ వెలుగు చూసింది. హైదరాబాద్ కేంద్రంగా కిడ్నీ రాకెట్ నడుస్తోందని పోలీసులు గుర్తించారు. హైదరాబాదులోని ఒక ప్రముఖ డాక్టర్ ప్రమేయం ఉందని కేరళ పోలీస్ అంటు న్నారు. హైదరాబాద్ నుంచి కొచ్చి మీదు గా ఇరాన్ కు తీసుకువెళ్లి కిడ్నీ ఆపరేషన్లు చేస్తున్నట్లు సంచలన విషమాలు వెలుగులోకి వచ్చాయి.ఇప్పటివరకు పదుల సంఖ్యలో యువకుల్ని ఇరాన్ తీసుకొని వెళ్ళి ఆపరేషన్ చేయించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొచ్చిలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ లో సబిత్ అనే యువకుడు అదుపులో తీసుకున్నట్లు సమాచారం. సబిత్ ఇచ్చిన సమాచారంతో కేరళ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ డాక్టర్ కి ఇద్దరు యువకులు సహకరించిన ట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ముఠా సభ్యులు బెంగళూరు, హైదరాబాద్‌లోని పేద యువకులను ఇరాన్‌కు తీసుకెళ్లి అక్కడ వారి కిడ్నీలను విక్రయిస్తున్నారు. బాధితుల్లో ఒకరు మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరాన్ నుంచి కొచ్చికి వచ్చిన ముఠాలోని కీలక సభ్యుడు సబిత్ ను కేరళ పోలీసులు గత ఆదివారం విమానాశ్రయంలో అరెస్టు చేశారు. సోమవారం అంగమాలి జ్యుడీషి యల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.
కేరళలో వెలుగు చూసిన మరో కిడ్నీ రాకెట్
0
295
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


