యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డ్రాగన్. ఈ మూవీకి ప్రశాంత్ నీల్ డైరెక్టర్. ఈ భారీ సినిమా సక్సెస్ ఎన్టీఆర్ కి చాలా కీలకం. ఎందుకంటే.. వార్ 2 మూవీ డిజాస్టర్ అవ్వడంతో.. ఈసారి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సాధించాల్సిన పరిస్థితి. అందుకనే.. ప్రశాంత్ నీల్ కథ పై మళ్లీ కసరత్తు చేసారట. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఈ క్రేజీ మూవీ టీమ్ లోకి మరో డైరెక్టర్ చేరారట. ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ.. ప్రశాంత్ నీల్ టీమ్ లో చేరిన ఆ డైరెక్టర్ ఎవరు..? అసలు ఈ క్రేజీ మూవీ తెర వెనుక ఏం జరుగుతోంది..?
ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీతో.. గ్లోబల్ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రేజ్ కు తగ్గట్టుగానే.. దేవర అంటూ భారీ పాన్ ఇండియా మూవీ చేసాడు. ఈ మూవీకి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. ఎన్టీఆర్ కు ఉన్న మాస్ ఇమేజ్ కారణంగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఆతర్వాత వార్ 2 మూవీతో బాలీవుడ్లో భారీ విజయం సాధించాలని యంగ్ టైగర్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కలిసి నటించిన వార్ 2 బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. అందుకనే ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న మూవీ గురించి చాలా కేర్ తీసుకుంటున్నారు. ఈసారి బ్లాక్ బస్టర్ మిస్ అవ్వకూడదని షూటింగ్ ఆపేసి మరీ.. ప్రశాంత్ నీల్ కథ పై మళ్లీ వర్క్ చేసారు.
లేటెస్ట్ గా ఈ సినిమా కోసం మరో డైరెక్టర్ దేవ కట్టా వర్క్ చేస్తున్నారనే వార్త లీకైంది. ఈ న్యూస్ బయటకు రాగనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రశాంత్ నీల్.. దేవ కట్టాను తీసుకోడానికి కారణం ఏంటి అనేది హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. కొన్ని కీలకమైన యాక్సన్ సీన్స్ అలాగే పవర్ ఫుల్ డైలాగ్స్ రాసే బాధ్యతను దేవ కట్టాకు అప్పగించారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దేవ కట్టా ప్రస్థానం సినిమాతో తన టాలెంట్ ఏంటో చూపించారు. ప్రస్థానం, రిపబ్లిక్.. ఈ రెండు చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు.
దర్శకధీరుడు రాజమౌళి కూడా తన సినిమాలకు దేవ కట్టాతో డైలాగ్స్ రాయిస్తుంటారు. వారణాసి మూవీ కోసం దేవ కట్టా డైలాగ్స్ రాస్తున్నారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇప్పుడు ప్రశాంత్ నీల్ సైతం ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా పవర్ ఫుల్ డైలాగ్స్ రాసే బాధ్యతను దేవకట్టాకు అప్పగించారట. ఎన్టీఆర్ పవర్ ఫుల్ పర్ ఫార్మెన్స్ కు.. ప్రశాంత్ నీల్ టేకింగ్.. దేవ కట్టా డైలాగ్స్ తోడైతే.. థియేటర్స్ లో పూనకాలే అంటున్నారు సినీ అభిమానులు. దేవ కట్టా మాస్ జనాలకు బాగా నచ్చేలా అద్భుతమైన సీన్స్ డిజైన్ చేశారట. టైటిల్ విషయానికి వస్తే.. డ్రాగన్ కాకుండా మరో పవర్ ఫుల్ టైటిల్ గురించి చూస్తున్నారట. ఇందులో ఎన్టీఆర్ కు జంటగా రుక్మిణి వసంత్ నటిస్తుంది. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డేకు ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ గ్లింప్స్ తో టైటిల్ పై క్లారిటీ వస్తుంది. మొత్తానికి యంగ్ టైగర్ బ్లాక్ బస్టర్ సాధించాలని చాలా కేర్ తీసుకుంటున్నాడు. మరి.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్‌లో సౌండ్ చేస్తాడో చూడాలి.


