ధనిక ముఖ్యమంత్రి పాలనలో ఉన్నపేద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్..! -ట్విట్టర్ వేదికగా జగన్‌పై సెటైర్లు పేల్చిన పవన్‌కల్యాణ్‌

  • దేశంలోనే సీఎం జగన్ క్లాస్ వేరంటూ వరుస ట్వీట్లతో ఎద్దేవా
  • దేశంలో మిగతా సీఎంలందరి మొత్తం సంపాదన కంటే మన సీఎం సంపదే ఎక్కువ
  • వైసీపీ రాజ్యంలో ప్రజలను బానిసలుగా మార్చుకున్నారని విమర్శలు
  • వైసీపీ ప్రభుత్వం పెట్టుబడుల స్వర్గాన్ని ఆంధ్రాకి తీసుకొచ్చినప్పుడు ఇంకా దావోస్ ఎవరికి కావాలని సెటైర్‌
  • ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి ఇప్పటికే నూడుల్స్ సెంటర్లు, చాయ్ పాయింట్లు ప్రారంభిస్తున్నారని ఎద్దేవా

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి విమర్శల వర్షం కుపించారు. ట్విట్టర్ వేదికగా సెటైర్లు పేల్చారు జనసేనాని. దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి పాలనలో ఉన్నపేద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటూ దుయ్యబట్టారు.

దేశంలోనే ఏపీ సీఎం జగన్ క్లాస్ వేరంటూ వరుస ట్వీట్లతో ఎద్దేవా చేశారు. ‘ఆక్సిమోరాన్- అంటే విరుద్ధమైన పదాల కలయిక. ఉదాహరణకు దేశంలోని అత్యంత ధనిక ముఖ్యమంత్రి పాలనలో పేద ప్రజలు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు.

మన సీఎం సంపద దేశంలో మిగతా సీఎంలందరి మొత్తం సంపాదన కంటే ఎక్కువ. ఏపీ సీఎం క్లాస్ వేరు’ అని ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వర్గాలకు తావు లేదని, వైసీపీ రాజ్యంలో ప్రజలంతా బానిసలుగా మార్చుకున్నారని విమర్శించారు.

‘భూమి నుంచి ఇసుక వరకు, మద్యం నుంచి గనుల వరకు, అడవుల నుంచి కొండల వరకు, కాగితం నుంచి ఎర్రచందనం వరకు ఏపీ నుంచి ప్రతి పైసా ధనిక ముఖ్యమంత్రి చేతిలో ఉందన్నారు.

ఇది నిజంగా క్లాసిక్’ అని మరో ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ప్రజల జీవితాలు, గౌరవం, కష్టం వంటివి కొంతమందికి అమ్ముడుపోయాయని, మధ్యతరగతి కుటుంబాలు రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురవుతున్నారని అన్నారు. వైసీపీ వారిని పన్ను చెల్లించే వారిగానే చూస్తోందన్నారు.

‘పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నారు.. ఇదో మాస్టర్ క్లాస్. వైసీపీ ప్రభుత్వం పెట్టుబడుల స్వర్గాన్ని ఆంధ్రానికి తీసుకొచ్చినప్పుడు ఇంకా దావోస్ ఎవరికి కావాలి.

మన ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి ఇప్పటికే నూడుల్స్ సెంటర్, చాయ్ పాయింట్లు ప్రారంభిస్తున్నారు. ఇక ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయడం కోసం వేచి చూడాలి.

ఇది కూడా మరో క్లాస్ యాక్ట్. అరకులో బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహిస్తున్న భారతదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి కామ్రేడ్ చారు మజుందార్, కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి .

కామ్రేడ్ పుచ్చలిపల్లి సుందరయ్య వంటి ‘క్లాస్ వార్’ గురించి మాట్లాడుతున్నారు. ఇదేం చోద్యం’ అని పవన్ ట్వీట్ చేశారు.

Latest Articles

సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి

విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్