వేణు స్వామిని కలిసిన అనన్య.. అసలేం జరుగుతోంది?

ఈ తరం తెలుగు హీరోయిన్లలో ఎక్కువ అవకాశాలు అందుకుంటున్న వాళ్లలో అనన్య నాగళ్ల టాప్ ప్లేస్‌లో ఉందని చెప్పొచ్చు. ‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ తర్వాత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలో కీలక పాత్రలో నటించి వకీల్ సాబ్ అనన్యగా ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో కనిపించినప్పటికీ ఏవీ అంతగా ఆమెకు విజయాన్ని ఇవ్వలేదు. ‘మళ్లీపెళ్లి’ చిత్రంలో పవిత్ర లోకేష్ యంగ్ క్యారెక్టర్ చేసిన అనన్య.. ఆ చిత్రంలో తన అందాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘తంత్ర’ అనే డిఫరెంట్ హారర్ చిత్రంతో అనన్య నాగళ్ల ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అయితే ఈ సినిమా తర్వాత అనన్యలో చాలా మార్పు వచ్చింది. ఉన్నట్టుండి ఆమె అనేక దేవాలయాలను సందర్శించింది. తాంత్రిక పూజలతో కూడిన ‘తంత్ర’ సినిమాలో నటించడంతో ఆ సినిమా ఆమెలో మార్పును తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది. ఇక తాజాగా వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామిని అనన్య కలిసిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది. వేణు స్వామిని అనన్య నాగళ్ల ఎందుకు కలిసిందంటూ చర్చ మొదలైంది. కొంతమంది సెలబ్రిటీలో వేణుస్వామితో ప్రత్యేక పూజలు చేయించిన ఫొటోలను ఆయనే స్వయంగా బయటపెట్టారు. గతంలో డింపుల్ హయతి కూడా వేణుస్వామిని ఆశ్రయించి పూజలు జరిపించారు. ఇప్పుడు అనన్య నాగళ్ల ఎలాంటి పూజలు జరిపించారు? తంత్ర సినిమా విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు జరిపించడానికే ఆమె వేణుస్వామిని కలిశారా? లేక వ్యక్తిగతంగా ఏమైనా పూజలు చేయించారా? అనే సందేహాలు నెలకొన్నాయి.

‘తంత్ర’ సినిమా తర్వాత అనన్య నాగళ్ల వివిధ దేవాలయాలకు వెళ్లడం వెనుక కూడా వేణుస్వామి ఉన్నట్లు తెలుస్తోంది. వేణుస్వామిని కలిసిన అనంతరం కూడా ఆమె అనేక దేవాలయాలను సందర్శించారు. మొత్తంగా ‘తంత్ర’ సినిమా అనన్య నాగళ్లలో దైవభక్తిని పెంచేలా చేసిందని టీమ్ కూడా చెబుతోంది. ఈ నెల 15న విడుదల కాబోతున్న ‘తంత్ర’ సినిమా విజయం కోసం అనన్య నాగళ్ల తన శక్తివంచన లేకుండా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలదేవిని కూడా కలిసి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. శ్యామలా దేవిని కలవడానికి ముందు కోయదొరతో జోస్యం చెప్పించుకున్నారు. ఆమె జాతకంలో పెద్దవాళ్లతో సినిమాలు చేసే అవకాశం ఉందని కోయదొర చెప్పడం.. ఆ తర్వాత ప్రభాస్ పెద్దమ్మను అనన్య కలవడం యాదృచ్చికమా? లేక కాలానుగుణంగా జరిగిందా? అనే ప్రశ్నను ‘తంత్ర’ టీమ్‌తో నిర్వహించిన స్పెషల్ ఇంటర్వ్యూలో స్వతంత్ర అడగ్గా.. అనన్య దానికి సమాధానం చెబుతూ అంతా విధి అని వెల్లడించారు.

అనన్య ప్రస్తుతం ‘పొట్టేల్’, ‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్’ చిత్రాల్లో నటిస్తోంది. ‘తంత్ర’ తర్వాత ఆ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. పొట్టేల్ కోసం తొలిసారి లిప్ లాక్ సీన్ చేసి.. గ్లామర్ పాత్రలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనన్య.

Latest Articles

సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి

విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్