పొత్తులు – సీట్ల సర్దుబాటుపై చర్చ

      డీపీ – బీజేపీ – జనసేన పార్టీల ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, కేంద్ర మంత్రి షెకావత్‌ హాజరుకానున్నారు. కాసేపట్లో ఈ ఉమ్మడి సమావేశం జరగనుంది. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై కసరత్తులు చేయనున్నారు. మూడు పార్టీల అగ్ర నేతల భేటీలో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి పాల్గొననున్నారు.

ఇప్పటికే షెకావత్ – పవన్ మధ్య భేటీ జరిగింది. మొత్తం 30 అసెంబ్లీ స్థానాల్లో జనసేన – బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేయాలనే అంశంపై చర్చించారు. పాడేరు, విశాఖ నార్త్, పి. గన్నవరం, కాకినాడ అర్బన్, ఉంగుటూరు, కదిరి, మదనపల్లె, కాళహస్తి, కైకలూరు నియోజకవర్గాల్లో పోటీ చేస్తామనే ప్రతిపాదనను బీజేపీ పెట్టినట్టు సమాచారం. ప్రతిపాదిత స్థానాల్లో నుంచి ఆరు స్థానాల్లో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. ఎవరెవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలనే అభిప్రాయానికి బీజేపీ – జనసేన వచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ చంద్రబాబుతో భేటీలో సీట్ల సర్దుబాటుపై షెకావత్, పవన్ కల్యాణ్ చర్చించనున్నారు. ఇవాళ లేదా రేపు సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Latest Articles

నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ

మేడ్చల్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్