వైసీపీ తప్పు చేసినా వదలను: ఆళ్ల రామకృష్ణారెడ్డి

ఇటీవల వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను షర్మిల వెంట నడుస్తానని స్పష్టం చేశారు. షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే ఉంటానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై సంచలన కామెంట్స్‌ చేశారు. వైసీపీకి సిద్ధాంతాలు ఉండాలని సూచించారు. అంతేకాదు మంగళగిరి ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని అన్నారు. 1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి.. 120 కోట్లే కేటాయించారని ఆరోపించారు. మంగళగిరి అభివృద్ధి నిధులు విడుదల కాలేదన్న ఆర్కే.. 8 కోట్ల వరకు అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోంత డబ్బుతో అభివృద్ధి పనులు చేశానని చెప్పారు.

లోకేశ్‌ను ఓడించిన తనకు అధిష్టానం సహకారం అందించకపోతే ఎలా? .. అని ప్రశ్నించారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. రాజీనామా ఆమోదించకపోవడం అనేది వాళ్ల ఇష్టమని చెప్పారు. తాను స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా ఇచ్చానన్న ఆర్కే.. తన వ్యాఖ్యలకు సీఎం జగన్‌ సమాధానం చెప్పాలని కోరారు.

చంద్రబాబుపై వేసిన కేసులపై న్యాయ పోరాటం చేస్తాననిఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో కూడా కేసును వెనక్కి తీసుకోననని అన్నారు. షర్మిల కాంగ్రెస్‌లోకి వచ్చినా తన పోరాటం ఆగదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం తప్పు చేస్తే కేసులు వేసేందుకు కూడా వెనకాడనని ఈ సందర్బంగా ఆర్కే సంచలన వ్యాఖ్యలు చేశారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్