తమిళనాడులో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అన్నాడీఎంకే పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు టీవీకే అధినేత విజయ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీ అత్యవసర సమావేశానికి ఎమ్మెల్యేలను పిలిచింది. రేపు అత్యవసర భేటీకి రావాలని ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చింది.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీవీకే పార్టీ భారీ విజయం సాధించింది. 107 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. తొలి ఎన్నికల్లోనే అధికారం కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్‌లో భారీ మెజార్టీతో విజయ్ గెలుపొందారు.
డీఎంకే 72 సీట్లతో రెండో స్థానంలో ఉండగా, అన్నాడీఎంకే 52 సీట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. కొళత్తూర్ నియోజకవర్గంలో డీఎంకే నేత స్టాలిన్ కూడా ఓటమి పాలయ్యారు.


