స్వతంత్ర వెబ్ డెస్క్: రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమా విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ల్స్ కి గురవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సంభాషణల విషయంలో ఎన్నో ట్రోల్ల్స్ వచ్చిన వాటి గురించి డైలాగ్ రైటర్ మనోజ్ ముంతిషర్ స్పందిస్తూ వచ్చారు. అయితే సినిమా ఇన్ని ట్రోల్ల్స్ ఎదుర్కొంటున్న నేపథ్యంలో మొదటిసారిగా దర్శకుడు ఓం రౌత్ స్పందించారు. విమర్శల కంటే కూడా బాక్సాఫీసు వద్ద ఆదిపురుష్ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందన్నదే ముఖ్యమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ చిత్రం రాబడుతున్న వసూళ్లతో తాను చాలా సంతోషిస్తున్నానని తెలిపారు. రామాయణంలో నేను అర్థం చేసుకున్న అతి కొద్ది భాగాన్ని, మీకు తెలిసిన అతి కొద్ది భాగాన్ని మాత్రమే నేను సినిమా తీశాను. ఇది ఉడత సాయం కిందికే వస్తుంది. నేను బాల్యంలో టీవీలో చూసిన రామాయణం చాలా పెద్దది. కానీ నేను రామాయణంలోని కొంత భాగాన్ని మాత్రమే సినిమాగా తీశాను, కేవలం యుద్ధకాండనే సబ్జెక్టుగా తీసుకున్నాను” అని ఓం రౌత్ వివరించారు.
ట్రోల్ల్స్‌పై మొదటిసారి స్పందించిన ఆదిపురుష్ దర్శకుడు
0
390
Previous article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


