Amitabh Bachchan |హైదరాబాద్‌లో అమితాబ్‌ బచ్చన్‌కు తీవ్ర గాయాలు..

Amitabh Bachchan  |బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. షూటింగ్‌లో ప్రమాదం జరగడంతో అమితాబ్‌తో పాటు మరికొంతమంది చిత్ర యూనిట్ సభ్యులు గాయపడ్డారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రాజెక్ట్ కె షూటింగ్ సెట్ లో చిన్న ప్రమాదం జరగడంతో తనతోపాటు మరికొద్ది మంది యూనిట్ సభ్యులు గాయపడ్డారని.. ప్రస్తుతం తాను విశ్రాంతి తీసుకుంటుండగా.. మిగతా వారికి చికిత్స అందిస్తున్నారని అమితిబ్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం సొంతంగా బ్లాగ్ క్రియేట్ చేసిన అమితాబ్ తన జీవితంలో జరిగిన విషయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఇందులో తాను ఇటీవల ప్రాజెక్ట్ కె సినిమా చిత్రీకరణ సెట్ లో ప్రమాదానికి గురైనట్టు తెలిపారు. ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజులుగా హైదరాబాద్‏లో శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలోని ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు ప్రమాదం జరిగిందని.. తనకు గాయాలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం తాను ముంబైలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ కె షూటింగ్ సమయంలో ఒక యాక్షన్ షాట్ సమయంలో ప్రమాదం జరిగిందని, వెంటనే AIG హాస్పిటల్‌లో డాక్టర్లను సంప్రదించగా.. తనకు CT స్కాన్ చేశారని, మిగతావారికి ఇంకా చికిత్స అందిస్తున్నారని చెప్పారు. తనకు తగిలిన గాయం కాస్త నొప్పిగానే ఉందని, కదలడానికి , ఊపిరి తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది ఉందని తెలిపారు. కోలుకోవడానికి కొన్ని వారాలు పడుతుందన్నారు. నొప్పికి కొన్ని మందులు ఉపయోగిస్తున్నట్లు అమితాబ్‌ వెల్లడించారు. గాయం కారణంగా చేయాల్సిన పనులన్నీ ఆగిపోయాయని, చికిత్స పూర్తయ్యే వరకు ఎలాంటి పనులు చేయకూడదని వైద్యులు సూచించారన్నారు.

రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణే జంటగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న చిత్రం ప్రాజెక్ట్ కె. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ మూవీపై మరింత క్యూరియాసిటి పెంచగా.. ఇందులో అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 Read Also:  వైజాగ్‌లో ఆ మూవీ కోసం భారీ సెట్‌.. అతగాడికి కెరీర్‌లో మొదటి పాన్‌ ఇండియా మూవీ..

Follow us on:   Youtube   Instagram

Latest Articles

బాలయ్య సినిమాల.. ప్లానింగ్ మారుతుందా..?

నందమూరి బాలకృష్ణకి.. షూటింగ్లో గాయాలు అవ్వడం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య సినిమాల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్