జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం మెగా హీరో వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ఇవాళ ప్రచారం చేయనున్నారు. గొల్లప్రోలు రూరల్ మండలం తాటిపర్తిలో ఇవాళ మధ్యాహ్నం ప్రారంభం కానున్న రోడ్ షో.. వన్నెపూడి, కొడవలి, చందుర్తి, దుర్గాడ మీదుగా కొనసాగనుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది.
ఇవాళ పెద్దాపురం, కాకినాడ రూరల్‌లో పవన్ వారాహియాత్ర నిర్వహించనున్నారు. కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు పవన్‌కళ్యాణ్. పిఠాపురంలో పోటి చేస్తున్న జనసేనాని పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగుతోంది. వరుణ్‌తేజ్ ప్రచారానికి సంబంధించి రోడ్‌షో, సభలు జరిగే ప్రాంతాల వివరాలను ఇప్పటికే జనసేన ప్రకటించింది.


