హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించడం లేదని ఓ ప్రేమోన్మాది యువతి గొంతు కోశాడు. ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలోని బోరబండ బంజారానగర్ కు చెందిన సురేష్ అనే యువకుడు ఓ యువతి చుట్టూ ప్రేమ పేరుతో 7ఏళ్లుగా వెంటపడుతున్నాడు. అయితే ఆ యువతి సురేష్ ప్రేమను పట్టించుకోకపోవడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. ఆమె గొంతు కోసే ప్రయత్నం చేస్తుండగా స్థానికులు యువకుడిని పట్టుకుని చితకబాదారు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువతిని హుటాహుటిన దగ్గర్లోని ఆసుప్రతికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ లో దారుణం.. యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది
0
360
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


