హైడ్రా చర్యలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మానవత్వం ఉన్న ప్రభుత్వమే అయితే ముందు నోటీసులు ఇవ్వాలని అన్నారు. అసలు హైడ్రాకు చట్టం లేదని కేటీఆర్ అన్నారు. హైడ్రా బాధితులకు అండగా ఉండేందుకు కార్యాచరణ తీసుకుంటామన్నారు. అయ్యప్ప సొసైటీలో తిరుపతి రెడ్డి ట్యాక్స్ నడుస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఆయన సోదరులు, బంధువులు హైదరాబాద్ మీద పడి స్వైర విహారం చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి ఒక న్యాయం.. పేదలకు ఒక న్యాయమా? అని కేటీఆర్ అడిగారు. దమ్ముంటే నిర్మాణాలకు పర్మిషన్‌లు ఇచ్చిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సవాల్ విసిరారు.