‘కిరాక్ బాయ్స్ కిలాడి గాళ్స్’తో వినోదాల విందు

అమ్మాయిలు, అబ్బాయిల్లో ఎవరు గొప్ప? అనే క్వశ్చన్ వచ్చిందంటే.. మేము అంటే మేము అని రెండు టీములు ముందుకొస్తాయి. మాటా మాటా పెరిగి యుద్ధాలు మొదలవుతాయి. యుద్ధం అంటే సీరియస్‌గా కాదు.. సరదాగా. సమరం అంటే ఆయుధాలతో కాదు.. మాటలతో. ఇదే కాన్సెప్ట్‌తో స్టార్ మా ఒక కొత్త షో ప్రారంభిస్తోంది. షో పేరు “కిరాక్ బాయ్స్ కిలాడి గాళ్స్”. ప్రముఖ డాన్స్ డైరెక్టర్ శేఖర్ మాస్టర్; బుల్లితెర, వెండితెరల్లో తనదైన ముద్ర వేసిన అనసూయ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. తెలుగు తెలివిజన్‌లో నెంబర్ వన్ వెర్సటైల్ యాంకర్ శ్రీముఖి ఈ షోని నడిపించబోతున్నారు. చార్మింగ్ స్టార్స్ ఎందరో ఈ ఫన్నీ షోతో “రొటీన్ ఫార్ములా”ని బ్రేక్ చేయబోతున్నారు.

స్టార్ మాలో జూన్ 29 నుంచి రాత్రి 9 గంటలకు ప్రతి శని, ఆదివారాల్లో ప్రసారమవుతుంది. ఒకవైపు గాళ్స్ టీమ్, మరోవైపు బాయ్స్ టీమ్ పోటీలో పూర్తిస్థాయి ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నారు. సరదా సరదాగా జరిగే ఈ సమరంలో ప్రేక్షకులకు కావలసినంత వినోదాల విందు అందబోతోంది. గేమ్‌లో ఆట పాటలతో పాటు ఊహించని రౌండ్స్, చిత్ర విచిత్రమైన టాస్కులు, అలరించే ఛాలెంజ్‌లు అన్నీ కలిసి షోని అద్భుతంగా అందించబోతున్నాయి. బేసిక్ పోటీ అమ్మాయిలూ అబ్బాయిల మధ్యే అయినా.. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా.. ఈ షో స్టార్ మా ప్రేక్షకులను మాత్రం అవుట్ అండ్ అవుట్ ఎంగేజ్ చేయడానికి సిద్ధం అవుతోంది.

Latest Articles

210 కిలోల నందిని పాలపొడి పట్టివేత!

  కర్ణాటక ప్రభుత్వం చిన్నారుల కోసం అమలు చేస్తున్న ఉచిత పాల పథకానికి చెందిన నందిని పాలపొడి అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలోని ఆలేరు వద్ద ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో 210 కిలోల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్