కోవిడ్ అప్డేట్.. మరోసారి 12వేలకు పైగా కొత్త కేసులు

Covid Cases in India  | దేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తుంది. తాజాగా మరోసారి 12వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో కొత్తగా 12,193 మందికి కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయిందని శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను వెల్లడించింది. దీంతో క్రియాశీల కేసులు 67,556 (0.15శాతం)కి చేరాయి. నిన్న ఒక్కరోజు దేశంలో 42 మంది కరోనాతో మృతి చెందారు. అందులో కేరళ నుంచే 10 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం రికవరీ రేటు 98.66 శాతంగా ఉంది. ఇప్పటివరకూ 220.66 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్యాధికారులు పేర్కొన్నారు.

కరోనా పెరగటంతో మరోసారి రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర సర్కారు. కరోనా ఇంకా పూర్తిగా ముగిసిపోలేదని.. రాష్ట్ర ప్రజలందరిని అప్రమట్టం చేయవలసిన బాధ్యత మనదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు లేఖ రాశారు. కరోనాతో ఆసుపత్రిలో చేరికలు, మరణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. అధిక సంఖ్యలో కేసుల నమోదు స్థానికంగా వైరస్‌ వ్యాప్తిని సూచిస్తోందన్నారు. ప్రారంభంలోనే కరోనాను నియంత్రించే చర్యలు చేపట్టాలని సూచించారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్