భారతదేశంలో ముస్లిం సోదరులు రేపు(శనివారం) రంజాన్ పండుగను జరుపుకోనున్నారు. శుక్రవారం రాత్రి నెలవంక కనిపించడంతో దేశమంతా శనివారం ఈద్-ఉల్-ఫితర్(Eid-ul-Fitr) జరుపుకోవడానికి ముస్లింలు రెడీ అయ్యారు. నేడు నెలవంక కనిపించడంతో రేపు రంజాన్ పండుగ జరుపుకోనున్నట్లు లక్నోలోని ఈద్గా ఇమామ్ మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహాలీ తెలిపారు. దీంతో ముస్లింలు తమకు కావాల్సిన వస్తువులను కొనేందుకు మార్కెట్లలో సందడి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం రంజాన్ మాసం 29లేదా 30రోజులు ముగింపు దశకు వచ్చిన సమయంలో ముందు రోజు రాత్రి నెలవంక కనిపిస్తే తర్వాతి రోజు పండుగను జరుపుకుంటారు. మరోవైపు సౌదీ అరేబియాతో పాటు చాలా ముస్లింల దేశాల్లో గురువారం రాత్రి నెలవంక కనపడడంతో ఇవాళే రంజాన్ పండుగను జరుపుకున్నారు.
ఇండియాలో కనిపించిన నెలవంక.. రేపే రంజాన్ పండుగ
0
291
Previous article
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


