యాదాద్రి నరసింహుడికి బంగారు కిరీటాల బహుకరణ

Yadadri | సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకున్న యాదాద్రికి దినదినం భక్తుల తాకిడి పెరుగుతుంది. శ్రీ లక్ష్మినరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలివస్తున్నారు. అద్భుతమైన శిల్ప కళతో శోభిల్లుతున్న యాదాద్రి.. నిత్యం భక్తులతో కిక్కిరిసిపోతుంది. అనేక మంది భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటూ కానుకలు సమర్పిస్తున్నారు. తాజాగా, హైదరాబాద్ లోని చంపాపేట్ కు చెందిన మాచమోని ప్రకాశ్‌ ముదిరాజ్ అనే భక్తుడు స్వామి వారి పట్ల భక్తిని చాటుకున్నాడు. సుమారు రూ. 30 లక్షల విలువచేసే అర కేజీ బంగారం, అరకేజీ వెండితో మూడు కిరీటాలు, ప్లేట్లు స్వామి వారికి బహూకరించారు. కళ్ళు జిగేల్ మనేలా స్వామి వారి కిరీటం అందర్నీ అబ్బురపరుస్తుంది. దీనికి సంబంధించిన కిరీటాలను ఆలయ ఈవో గీతకు అందజేశారు. అనంతరం మాచమోని ప్రకాశ్‌ కుటుంబ సభ్యులను అర్చకులు వేదాశీర్వచనం చేశారు.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్