ఏపీ మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivasa Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మీడియాతో బాలినేని స్పందిస్తూ.. తాను గత 25 సంవత్సరాలుగా విలువలు గల రాజకీయాలు మాత్రమే నడుపుతున్నాని అన్నారు. విలువలు లేకపోతే తాను రాజకీయాలు నడుపనని అన్నారు. విలువల కోసం ఎంతవరకైనా పోరాడుతా. అనవవసర విషయాలు చేస్తే మట్టుకు ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. ఎంతపెద్ద మొగోడైన నేను ఎదురిస్తానన్నారు. కాగా, ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం పర్యటన సందర్బంగా బాలినేనికి చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే.