Yadadri | సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకున్న యాదాద్రికి దినదినం భక్తుల తాకిడి పెరుగుతుంది. శ్రీ లక్ష్మినరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలివస్తున్నారు. అద్భుతమైన శిల్ప కళతో శోభిల్లుతున్న యాదాద్రి.. నిత్యం భక్తులతో కిక్కిరిసిపోతుంది. అనేక మంది భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటూ కానుకలు సమర్పిస్తున్నారు. తాజాగా, హైదరాబాద్ లోని చంపాపేట్ కు చెందిన మాచమోని ప్రకాశ్ ముదిరాజ్ అనే భక్తుడు స్వామి వారి పట్ల భక్తిని చాటుకున్నాడు. సుమారు రూ. 30 లక్షల విలువచేసే అర కేజీ బంగారం, అరకేజీ వెండితో మూడు కిరీటాలు, ప్లేట్లు స్వామి వారికి బహూకరించారు. కళ్ళు జిగేల్ మనేలా స్వామి వారి కిరీటం అందర్నీ అబ్బురపరుస్తుంది. దీనికి సంబంధించిన కిరీటాలను ఆలయ ఈవో గీతకు అందజేశారు. అనంతరం మాచమోని ప్రకాశ్ కుటుంబ సభ్యులను అర్చకులు వేదాశీర్వచనం చేశారు.