అనర్హత వేటు తర్వాత తొలిసారిగా వాయనాడ్‌ కు రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పార్లమెంటు సభ్యునిగా అనర్హత వేటు పడిన తర్వాత తొలిసారిగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమైన వయనాడ్‌(Wayanad)లో నేడు (మంగళవారం) పర్యటించనున్నారు. తన పర్యటన సందర్భంగా వాయనాడ్‌లో బహిరంగ ర్యాలీతో పాటు రోడ్‌షో నిర్వహించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఎస్కేఎంజే స్కూల్ లో జన సంపర్క్ లో రాహుల్ పాల్గొననున్నారు. అనంతరం వాయునాడ్ బహిరంగ సభలో రాహుల్ పాల్గొని ప్రసంగిస్తారు.

2019లో వయనాడ్ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికైన రాహుల్ గాంధీ(Rahul Gandhi)… మార్చి 23వ తేదీన సూరత్ కోర్టు అతనిని దోషిగా నిర్ధారించి.. ఆపై శిక్షవిధించింది. ఆ తర్వాత తన సభ్యత్వాన్ని కూడా రాహుల్ కోల్పోయారు. 2019 ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలకు గాను రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడింది. ‘ఈ దొంగలందరికీ మోదీ ఇంటిపేరు ఎందుకు? నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ’ అని కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ(Modi) చర్యలను ప్రశ్నిస్తూ ప్రజల సహకారంతో నేటి నుంచి పౌష్టికాహార సంస్థలు/సెల్ల నేతృత్వంలో పోస్ట్‌కార్డ్ ప్రచారాన్ని రాహుల్ నిర్వహించనున్నారు. వాయునాడ్ నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీల ఆధ్వర్యంలో నేటి నుంచి ఏప్రిల్ 25 వరకు జై భారత్ సత్యాగ్రహం కూడా నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు జిల్లా స్థాయి జై భారత్ సత్యాగ్రహం నిర్వహించనున్నారు. కొచ్చి కేంద్రంగా మే 11 నుంచి 25 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా జై భారత్ సత్యాగ్రహం చేపట్టనున్నారు.

Read Also: అమెరికాలో కాల్పుల బీభత్సం… ఐదుగురు మృతి

Follow us on:  YoutubeInstagram, Google News

Latest Articles

సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా

సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్‌ వచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఆరోగ్య...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్