ధర్మవరంలో ‘మా నమ్మకం నువ్వే జగన్’ కార్యక్రమం చేపడుతున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి(Kethireddy Venkatarami Reddy)కి వింత అనుభవం ఎదురైంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఓ ఇంటికి వెళ్లి సీఎం జగన్ పాలన ఎలా ఉంది అని అడిగారు. దీంతో అక్కడున్న మహిళ ‘మద్యం ధరలు తగ్గించండి సార్’ అంటూ కోరింది. ‘నీ భర్త తాగకుండా ఉండేందుకే కదా ధరలు పెంచింది’ అని కేతిరెడ్డి సమాధానమివ్వగా.. ‘తాగకుండా ఉంటే మంచిదే సార్.. ధరలు కూడా తగ్గించాలి’ అని తెలిపింది. ‘తాగి వస్తే నీ భర్తకు అన్నం పెట్టొద్దు అనగా.. పనిచేసి వచ్చే వాడికి అన్నం పెట్టకపోతే ఎలా సార్’ అంటూ సమాధానమిచ్చింది. ‘ఆడపిల్లలున్న దాన్ని సార్.. వారిని చదివించుకోవాలి.. మద్యం ధరలు తగ్గించండి’ అంటూ విజ్ఞప్తి చేసింది. కేతిరెడ్డి, మహిళ మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మద్యం ధరలు తగ్గించండి సార్.. కేతిరెడ్డికి మహిళ విజ్ఞప్తి
0
290
Previous article
Next article
Latest Articles
ఎర్రవల్లిలో టెన్షన్ టెన్షన్
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. స్పీకర్‌పై తాతా మధు అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఫాంహౌస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు...
- Advertisement -
- Advertisement -


