ఓ వ్యక్తి విద్యార్థులను అతిదారుణంగా కొడుతూ.. చిత్రహింసలకు గురిచేస్తున్న వీడియో వాట్స్ ఆప్ గ్రూప్ లలో చక్కర్లు కొడుతుంది. నిర్దాక్షిణ్యంగా చేతితో బలంగా విద్యార్థుల వీపుపై కొడుతూ.. అతి దారుణమా కాలును పట్టుకుని తలక్రిందులుగా వేలాడదీస్తూ క్రూరంగా హింసించాడు. అయితే ఈ ఘోరానికి పాల్పడిన నిందితుడికి తగిన శిక్ష పడేలా.. విద్యార్థులకు న్యాయం జరిగేలా, అలాగే ఇలాంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే.. సంబంధిత అధికారులు పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలా జరగాలంటే అందరికి తెలిసేలా ఈ వీడియో ను ఫార్వర్డ్ చేయండి అంటూవాట్స్ ఆప్ గ్రూప్ లలో పోస్ట్ చేస్తున్నారు. ఏదేమైనా.. బాధిత విద్యార్థులకు న్యాయం జరగాలి.. పిల్లలకు ఏం జరుగకూడదు.. ఆ దుర్మార్గుడికి కచ్చితంగా శిక్ష పడాలి అంటూ వీడియో చూసిన వారు ఆవేదన చెందుతున్నారు.


