కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కాన్వాయ్ మీదకు ఓ యువకుడు దూసుకొచ్చాడు. వచ్చే నెలలో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో మోదీ దేవనాగరి జిల్లాలో నిర్వహించిన రోడ్డు షో పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో ఓ యువకుడు బారీకేడ్లను దాటుకుంటూ కాన్వాయ్ మీదకు ఒక్కసారిగా వచ్చాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పీఎం సెక్యూరిటీ సిబ్బంది ఆ యువకుడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కొప్పాల్ జిల్లాకు చెందిన ఆ యువకుడిని బీజేపీ కార్యకర్తగా పోలీసులు గుర్తించారు. కాగా మోదీ పర్యటనలలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో కర్ణాటకలోని హుబ్బలిలో నిర్వహించిన రోడ్‌షోలో కూడా ఇలాగే ఓ వ్యక్తి దూసుకొచ్చే యత్నం చేయగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం.. కాన్వాయ్ మీదకు దూసుకొచ్చిన యువకుడు
0
335
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


