ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన: రఘునందన్ రావు

Telangana: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంతో సంబంధం లేకపోతే మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించారని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. రాష్ట్రంలో ఏ కంప్యూటర్ ద్వారా సమాచారం లీకైనా… దానికి కేటీఆర్ నైతిక బాధ్యత వహించాలని అన్నారు. పేపర్ లీకేజీ ఘటన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన చేస్తున్నారని అన్నారు. తండ్రి మాదిరి.. కుమారుడు జర్నలిస్టులను తిట్టడం అలవాటుగా మారిందన్నారు. పేపర్ లీకేజీపై సంబంధం లేకుంటే విద్యాశాఖ మంత్రి మాట్లాడకుండా కేటీఆర్ మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. రాజు తర్వాత యువరాజుగా ఫీల్ అవుతున్నాడు కాబట్టే.. కేటీఆర్​ను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ ఏడాది ఎన్నికలు వస్తున్నందునే కేసీఆర్​కు రైతులపై ప్రేమ పొంగుకొస్తుందని అన్నారు. రాష్ట్రంలో కౌలు రైతుల‌ సంఖ్య ఎంతో వ్యవసాయ శాఖ కమిషనర్ శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Latest Articles

నాని లైనప్ మారిందా..?

నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్