తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధిపనులకు శ్రీకారం చుట్టేందుకు ఆయన వరంగల్‌కు రానున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను రాష్ట్ర బీజేపీ నాయకులు వెల్లడించారు. డిసెంబర్ నెలలో రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ సెంటర్‌ను ప్రధాని మోడీ జాతీకి అందితం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఇదే పర్యటనలో కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్‌ను ప్రారంభించనున్నారు. ఇక నవంబర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటించనున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసి అక్కడ బీజేపీ అధికారం చేపట్టింది. ఇక నెక్ట్స్ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోందని టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చే ప్లాన్‌తో రాబోయే షెడ్యూల్‌ను సిద్ధం చేసుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్‌లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో రామచందర్‌రావు అధ్యక్షతన ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్ రావులు పాల్గొన్నారు. బీజేపీ ముఖ్యనేతలు, వివిధ మోర్చాల అధ్యక్షులు, ఇతర నేతలు కూడా ఉన్నారు.
డిసెంబర్ నెలలో తెలంగాణకు ప్రధాని మోడీ రాక
0
10
Previous article
Next article
Latest Articles
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం – ముగ్గురి దుర్మరణం
కర్ణాటకలో జరిగిన హృదయ విదారక ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కారు అదుపుతప్పి ప్రమాదవశాత్తు చెరువులో బురదలోకి దూసుకెళ్లిన దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన...
- Advertisement -
- Advertisement -


