రాష్ట్రాల వారీగా మద్యం ధరల్లో తేడాలు..!

  • ఒకే బ్రాండ్‌.. ఒకే సైజు.. రాష్ట్రం మారితే ధరలో మార్పు 
  • 750 మి.లీ. తలమనే విస్కీ ధరల్లో భారీ వ్యత్యాసం
  • హర్యానాలో రూ.1,300.. 
  • ఢిల్లీలో రూ.1,850
  • గోవాలో తలమనే బాటిల్‌ ధర రూ.1,740
  • కర్ణాటకలో మాత్రం ఏకంగా రూ.3,425
  • మహారాష్ట్రలో తలమనే ధర రూ.2,300
  • హర్యానాతో పోలిస్తే 
  • కర్ణాటకలో రెట్టింపు కంటే ఎక్కువ ధర
  • మద్యం జీఎస్టీ పరిధి నుంచి మినహాయింపు
  • రాష్ట్రాలే సొంత ఎక్సైజ్‌, పన్నుల విధానాలపై నిర్ణయం 
  • రూ.2,000 బాటిల్‌లో రూ.1,305 వరకు పన్నులు, ఫీజులు, మార్జిన్లు
  • ఎక్సైజ్‌ డ్యూటీ రూ.425.. 
  • కస్టమ్స్‌ రూ.150
  • వ్యాట్‌/సర్ఛార్జ్‌ రూ.570.. 
  • రిటైల్‌ మార్జిన్‌ రూ.150
  • గోవాలో తక్కువ ధరలకు టూరిజం కూడా ఓ కారణం
  • 2024-25లో గోవా ఎక్సైజ్‌ ఆదాయం రూ.947.9 కోట్లు
  • కర్ణాటకలో తాజా పన్ను మార్పులతో ధరల్లో భారీ మార్పులు
  • చౌక మద్యం ధరలు సుమారు 20 శాతం పెరిగే అవకాశం
  • ప్రీమియం బ్రాండ్ల ధరలు 5-12 శాతం వరకు తగ్గే అవకాశం
  • రాయల్‌ స్టాగ్‌ గోవాలో రూ.370.. 
  • కర్ణాటకలో రూ.1,145
  • మెక్‌డవెల్స్‌ నం.1 గోవాలో రూ.340.. 
  • కర్ణాటకలో రూ.885
  • బకార్డీ వైట్‌ రమ్‌ గోవాలో రూ.700.. 
  • మహారాష్ట్రలో రూ.1,700
  • రాష్ట్రాల ఎక్సైజ్‌ పాలసీలే ధరల వ్యత్యాసానికి ప్రధాన కారణం
              భారతదేశంలో మందు బాటిల్ ధర మీరు ఏ రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్నారనే దానిపై ఆధారపడి పూర్తిగా మారిపోతుంది. ఒకే బ్రాండ్, ఒకే సైజు కలిగిన మద్యం సీసా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన ధరను కలిగి ఉంటుంది. సరిహద్దులు దాటితే ధరలలో కనిపించే ఈ భారీ తేడాలు వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ ధరల వ్యత్యాసం వినియోగదారుల కొనుగోలు ప్రవర్తనను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.  ధరలను బట్టి కొందరు బ్రాండ్లు మారుతుంటే, మరికొందరు కొనుగోలు చేసే సందర్భాలను లేదా పరిమాణాలను మార్చుకుంటున్నారు. ఉదాహరణకు, 750 మి.లీ. నాణ్యమైన విస్కీ బాటిల్‌ను పరిశీలిస్తే… హర్యానాలో దీని ధర సుమారు 1,300 రూపాయలు ఉండగా, ఢిల్లీలో ఇదే బాటిల్ రూ. 1,850 రూపాయలకి లభిస్తోంది. అదే కర్ణాటక విషయానికి వస్తే  3,425 రూపాయల వరకు పలుకుతోంది. అంటే హర్యానాతో పోలిస్తే కర్ణాటకలో అదే బాటిల్ ధర రెట్టింపు కంటే ఎక్కువే ఉంది. ఇక గోవాలో ఈ బాటిల్ ధర సుమారు  1,740 రూపాయలుగా ఉంది.
               అసలు ఒకే బ్రాండ్‌కు చెందిన ఉత్పత్తి కేవలం రాష్ట్ర సరిహద్దులు దాటినంత మాత్రాన ఎందుకు ఇంత వ్యత్యాసంగా మారుతోంది? దీనికి సమాధానం మద్యం తయారీలో కాకుండా, దానిపై విధించే పన్నులు, నిబంధనలలో ఉంది. భారతదేశంలో మానవ వినియోగం కోసం తయారయ్యే మద్యం జీఎస్‌‌టీ పరిధి నుంచి మినహాయించబడింది. దీనివల్ల ప్రతి రాష్ట్రం తన సొంత ఎక్సైజ్ మరియు సేల్స్-ట్యాక్స్ నిర్మాణాలను నిర్ణయించుకునే స్వేచ్ఛను కలిగి ఉంది. ఫలితంగా దేశంలో ఒకే బాటిల్ విభిన్న ధరలతో విక్రయించబడుతోంది. 2,000 రూపాయల విలువైన విస్కీ బాటిల్ కేవలం ఆ విస్కీ కోసమే కాదు; ఆ ధరలో సింహభాగం పన్నులు, డ్యూటీలు, ఫీజులు మరియు రిటైల్ మార్జిన్‌లకే వెళుతుంది. ఉదాహరణకు ఒక 2,000 రూపాయల ఎంఆర్‌పీ కలిగిన విస్కీ బాటిల్ పరిశ్రమ అంచనా ప్రకారం ధరల విభజన చూస్తే… ఎక్సైజ్ డ్యూటీ కింద  425 రూపాయలు, దిగుమతి ఫీజు లేదా కస్టమ్స్ డ్యూటీ కింద 150 రూపాయలు, ఇతర ఫీజులు లేదా సీఎస్‌టీ కింద 10 రూపాయలు, వ్యాట్ లేదా సర్ఛార్జ్ కింద 570 రూపాయలు, రిటైల్ మార్జిన్ కింద 150 రూపాయలు ఖర్చవుతాయి.
              ఈ అంశాలన్నీ కలిపి ఆ 2,000 రూపాయలు ఎంఆర్‌పీలో 1,305 రూపాయల వరకు ఆక్రమిస్తాయి.
షెల్ఫ్‌పై కనిపించే ధర కేవలం మందు తయారీ ఖర్చును మాత్రమే కాకుండా, రాష్ట్ర స్థాయి పన్నులు, రవాణా ఖర్చులు, రిటైలర్ మార్జిన్‌లను బట్టి మారుతుంటుంది. గోవా టూరిజం ఎకానమీ, సుదీర్ఘమైన మద్యం వ్యాపార చరిత్ర కారణంగా తక్కువ ధరలకు ప్రసిద్ధి చెందింది. గోవా ఎక్సైజ్ శాఖ ప్రకారం, పర్యాటక రంగానికి మద్యం లభ్యత ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో గోవా రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం దాదాపు 947.9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అయితే, డ్యూటీలు లేదా లైసెన్స్ ఫీజులను బట్టి అక్కడ కూడా ధరలు మారుతుంటాయి.  మరోవైపు కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మద్యం ధరలు అధికంగా ఉండటానికి కారణం ఆయా రాష్ట్రాల పన్ను విధానాలు, నియంత్రణలు విక్రయ పద్ధతులే. కర్ణాటకలో ఇటీవల అమల్లోకి వచ్చిన తాజా సంస్కరణలు ధరలపై తీవ్ర ప్రభావం చూపాయి. చౌక రకం మద్యం సుమారు 20 శాతం మేర ప్రియం కాగా, ప్రీమియం బ్రాండ్లు 5 శాతం నుంచి 12 శాతం వరకు, కొన్ని సందర్భాల్లో 20 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని వర్గాలు పేర్కొన్నాయి. ఆల్కహాల్ శాతం ఆధారిత పన్ను విధానం మార్పులు వినియోగదారుల జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయి.
                   భారతదేశంలో రాష్ట్రాలవారీగా ఎక్సైజ్ పాలసీలు, పన్నుల నిర్మాణాలు భిన్నంగా ఉండటం వల్ల ధరల్లో భారీ వ్యత్యాసాలు ఉంటున్నాయని రాడ్ ఎలాన్ డైరెక్టర్ అమిత్ గోయల్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలకు మద్యం అనేది ప్రధాన ఆదాయ వనరుగా ఉందని, అందుకే మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ వంటి రాష్ట్రాలు భారీ ఎక్సైజ్ సుంకాలను విధిస్తున్నాయని ఆయన వివరించారు. గోవా వంటి పర్యాటక ప్రాంతాల్లో ఆర్థిక ప్రాధాన్యతలు, టూరిజం డిమాండ్‌ను బట్టి విభిన్నమైన ధరల విధానం అమలవుతోందని తెలిపారు.
తమ ఉత్పత్తులైన ‘నెవర్‌మైండ్ వీర్ బియర్’, ‘పంటర్ సోజు’ వంటివి సరసమైన ధరల కారణంగానే వినియోగదారులకు సులభంగా అందుబాటులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. తలమనే వంటి ప్రీమియం బ్రాండ్ల విషయానికి వస్తే, 2026 ప్రస్తుత జాబితా ప్రకారం 750 మి.లీ బాటిల్ ధర గోవాలో 1,740 రూపాయలు, ఢిల్లీలో 1,850 రూపాయలు, హర్యానాలో  1,300 రూపాయలు, కర్ణాటకలో 3,425 రూపాయలు, మహారాష్ట్రలో 2,300 రూపాయలుగా ఉంది.
                 అలాగే బ్లెండర్స్ ప్రైడ్ రేర్ ప్రీమియం గోవాలో 700 రూపాయలు ఉండగా, కర్ణాటకలో 1,330 రూపాయలు, మహారాష్ట్రలో 1,500 రూపాయలుగా ఉంది. రాయల్ స్టాగ్ ప్రీమియం గోవాలో  370 రూపాయలు ఉండగా, కర్ణాటకలో 1,145 రూపాయలుగా ఉంది.  మెక్‌డవెల్స్ నం.1 ధర గోవాలో 340 రూపాయలు ఉంటే, కర్ణాటకలో 885 రూపాయలుగా ఉంది. బకార్డీ వైట్ రమ్ గోవాలో  700 రూపాయలు, మహారాష్ట్రలో 1,700 రూపాయలు  కేరళలో 1,550 రూపాయలు వరకు పలుకుతోంది. మొత్తానికి, వినియోగదారులకు తాము కొనుగోలు చేసే రాష్ట్రం బ్రాండ్ ఎంత ముఖ్యమో, అదే స్థాయిలో ధరను కూడా నిర్ణయిస్తోంది. వ్యాపారాల పరంగా చూస్తే, దేశవ్యాప్తంగా ఒకే రకమైన ధరల విధానం అమలు సాధ్యం కాదని, స్థానిక పన్నులు, నిబంధనలను అర్థం చేసుకోవడం ఎంతో అవసరమని ఈ విశ్లేషణ స్పష్టం చేస్తోంది.

Latest Articles

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

         ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా  తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్‌ చేసి దాడికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్