అక్కినేని నాగచైతన్య.. తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి 100 కోట్ల క్లబ్లో చేరడం తెలిసిందే. అయితే.. తండేల్ మూవీ రిలీజై సంవత్సరం దాటేసింది కానీ.. ఇంత వరుకు వృషకర్మ మూవీ రిలీజ్ కాలేదు. ఆమధ్య రిలీజ్ చేసిన వృషకర్మ గ్లింప్స్ సినిమా పై ఎక్స్ పెక్టేషన్స్ మరింతగా పెంచేసింది. అయితే.. ఇంత వరుకు వృషకర్మ మూవీ ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందో అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు డిసెంబర్ రేసులో వృషకర్మ అంటూ ప్రచారం జరుగుతుంది. మరి.. ప్రచారంలో ఉన్న వార్త నిజమేనా..? వృషకర్మ రిలీజ్ ఎప్పుడు..?
నాగచైతన్య హీరోగా కార్తీక్ దండు డైరెక్షన్లో రూపొందుతోన్న వృషకర్మ మూవీ గత సంవత్సర కాలంగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. మిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రైట్స్ అగ్రిమెంట్స్ కూడా కంప్లీట్ అయ్యాయని సమాచారం. ఇందులో నాగచైతన్యకు జంటగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్, క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తుండడం విశేషం.
ఈ భారీ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. డిసెంబర్లో చాలా సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ 3న ప్రభాస్ ఫౌజీ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. వృషకర్మ మూవీని కూడా డిసెంబర్లో రిలీజ్ కి రెడీ చేస్తుండడం ఆసక్తిగా మారింది. మరి.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే.. ప్రభాస్ ఫౌజీ డిసెంబర్ 3న రాకపోతే.. ఆ డేట్ కి వృషకర్మ విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.
ఒకవేళ ప్రభాస్ ఫౌజీ అనౌన్స్ చేసినట్టుగా డిసెంబర్ 3న వచ్చేస్తే.. నాగచైతన్య వృషకర్మ మూవీని డిసెంబర్ నెలాఖరున విడుదల చేయాలి అనేది మేకర్స్ ప్లాన్ అని తెలిసింది. త్వరలోనే ఈ క్రేజీ మూవీ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని సమాచారం. తండేల్ మూవీ 100 కోట్లు కలెక్ట్ చేయడంతో.. వృషకర్మ అంతకు మించిన సక్సెస్ సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. చైతూ కూడా ఈ సినిమా సక్సెస్ తో.. తన రేంజ్ మరింతగా పెంచుకోవాలని తపిస్తున్నాడు. మరి.. తండేల్ కు మించిన సక్సెస్ వృషకర్మ సాధిస్తుందేమో చూడాలి.


