ఏపీలో చాపకింద నీరులా విస్తరిస్తున్న గంజాయి అమ్మకాలు

హైదరాబాద్, బెంగుళూరు.. ముంబై.. ఢిల్లీ లాంటి నగరాలకే పరిమితమైన గంజాయి మత్తు ఇవాళ ఏపీలోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. జిల్లా కేంద్రాలకు, పట్టణాలకు పాకుతోంది. గతంలో వృద్ధులు.. సాధువులు.. సన్యాసులు జీవితంలో అన్నీ కోల్పోయిన వాళ్లు మాత్రమే గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడో నిర్మానుష్య ప్రాంతాల్లో గంజాయి తీసుకునేవారు. ఇప్పుడు కాలేజీకి వెళ్లే ఇంటర్.. డిగ్రీ.. బీటెక్ చదువుతున్న యువత గంజాయికి బానిసగా మారుతుండటం కలవరపెడుతున్న అంశం. కొత్తగా కొలువుతీరిన కూటమి ప్రభుత్వం గంజాయిపై ఉక్కు పాదం మోపుతుండటంతో.. గుట్టు రట్టవుతోంది. జిల్లాలోని పోలీసులందరూ సమన్వయంతో దాడులు చేస్తుండటంతో గంజాయి ముఠాలు పెద్ద ఎత్తున పట్టుబడుతున్నాయి. ఇంతకాలం చాప కింద నీరులా పాకిన గంజాయిని కూకటి వేళ్ళతో పెకలించేందుకు పోలీసులు ఆపరేషన్ గంజా మొదలుపెట్టారు.

ఉమ్మడి కడప జిల్లాకు విశాఖ నుంచి గంజాయి దిగుమతి అవుతోంది. ఈ విషయం గంజాయి విక్రయిదారుల అరెస్టు సందర్భంగా పోలీసుల విచారణలో వెల్లడయింది. విశాఖపట్నం నుంచి నిత్యం ప్రైవేట్ బస్సుల ద్వారా కడప.. ప్రొద్దుటూరు.. జమ్మలమడుగు మైదుకూరు.. రాయచోటి.. బద్వేల్.. పులివెందుల.. ప్రాంతాలకు సరఫరా జరుగుతతోంది. గంజాయి విక్రయిస్తున్న ముఠాల్లో ముఖ్యంగా డిగ్రీ.. పీజీ.. బీటెక్ చదివే విద్యార్థులు ఉంటున్నారు. ఈ గంజాయి విక్రయాలు జిల్లాలోని అన్ని ముఖ్య పట్టణాలు.. మండల కేంద్రాలకు సైతం పాకుతున్నట్లు తెలుస్తోంది. కాలేజీ విద్యార్థులు.. యువతే టార్గెట్గా సరఫరా జరుగుతోంది.

గంజాయి విక్రయిస్తున్న గ్యాంగులు జిల్లా వ్యాప్తంగా పట్టుబడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా గంజాయి పట్టుబడటానికి కారణం కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసుల నిఘా పెరిగింది. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆసాంఘిక నేరాలను అరికట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల కడపలో పలు స్టేషన్ల పరిధిలో గంజాయి విక్రయదారులను అరెస్టు చేసి వారి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు.ఇటీవల ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీసులు గంజాయి విక్రయించే నలుగురు యువకులను అరెస్టు చేశారు. వీరంతా 20 ఏళ్ల వయసున్న వారే. మీరు వైజాగ్ నుంచి తెలిసిన వ్యక్తుల ద్వారా పూతరేకుల మాటున గంజాయిని ప్రైవేటు బస్సుల్లో తీసుకొచ్చేవారని పోలీసులు గుర్తించారు. ఇలా తెప్పించిన గంజాయిని వీరు పొద్దుటూరు.. జమ్మలమడుగు కాలేజీలను టార్గెట్ చేసుకొని విక్రయాలు సాగించే వారని పోలీసుల విచారణలో బయటపడింది.

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నిఘా వ్యవస్థ పూర్తిగా నిద్రావస్థలో ఉండటంతో జిల్లాలో గంజాయి మత్తు పాకిందని ఇప్పటివరకు చేసిన అరెస్టులతో స్పష్టమవుతోంది. పోలీస్ వ్యవస్థ పూర్తిగా విధులను పక్కనపెట్టి నాయకుల అనుచరులుగా వ్యవహరిస్తూ పెద్ద ఎత్తున జేబులు నింపు నింపుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందువల్లే గతంలో జిల్లాలో జూదం.. పేకాట.. క్రికెట్ బెట్టింగ్.. అక్రమ మద్యం.. గంజాయి విచ్చలవిడిగా పెరిగాయి. ఇప్పటికైనా పోలీసులు గంజాయిపై ఉక్కుపాదం మోపడంతో హర్షం వ్యక్తం అవుతుంది.

Latest Articles

పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్‌ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్