పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ విధించారు. పర్యాటకులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని పొల్లూరు జలపాతం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొండలపై నుంచి భారీగా వస్తున్న నీటి ప్రవాహంతో జలపాతం ప్రమాదకరంగా మారింది. భద్రత దృష్ట్యా అధికారులు పర్యాటకులను జలపాతం వద్దకు అనుమతించడం లేదు. నో ఎంట్రీ బోర్డులు ఏర్పాటు చేసి, పోలీసు సిబ్బందితో పాటు అటవీ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. వర్షాలు తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు పర్యాటకులు జలపాతం వద్దకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.
చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్‌ఫాల్స్
0
15
Previous article
Latest Articles
లోక్ సభలో రాహుల్ ‘ఇడియట్’ వ్యాఖ్యలపై మాటల యుద్ధం
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య మాటల యుద్ధం జరిగింది....
- Advertisement -
- Advertisement -


