లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్రంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర హోం మంత్రి సభలో ఎందుకు లేరని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. హోం మంత్రి ఆదేశాలతోనే విద్యార్థులపై పెల్లెట్స్ దాడులు జరిగాయని అన్నారు. పోలీసుల దాష్టీకంపై అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సభకు వచ్చేందుకు అమిత్ షా భయపడ్డారని.. ఆయనకు ధైర్యం లేదని అన్నారు. దీంతో సభలో అధికార పక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం హోం శాఖకు సంబంధించిన అంశంపై చర్చ జరగడం లేదని స్పీకర్ అన్నారు. అయితే ఎన్డీఏ సభ్యులు సభలో ఆందోళనలు కొనసాగించారు. రాహుల్ గాంధీ ప్రసంగానికి అడ్డుతగిలారు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని అధికార పక్షం ఎంపీలు డిమాండ్ చేశారు. హోం మినిస్టర్ ఆర్డర్ ఇచ్చారని అంటున్నారు కదా.. ఆ ఆర్డర్ కాపీ చూపించాలని కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. అధికార , విపక్ష సభ్యుల ఆందోళనలతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో లోక్‌సభను వాయిదా వేశారు స్పీకర్.
రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సిందే.. లోక్‌సభలో ఎన్డీఏ సభ్యుల ఆందోళన
0
15
Previous article
Next article
Latest Articles
చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్‌ఫాల్స్
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -
- Advertisement -


